కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారా?

S Jaipal Reddy
మహబూబ్‌ నగర్‌: కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రచారంలోకి రావడంతో రాజకీయ సందడి ప్రారంభమైంది. ఆయన పలువురు రాజకీయ నేతలు కలవడం ఆసక్తికరంగా మారింది. అయితే, తనకు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన అన్నారు. "ముఖ్యమంత్రి మార్పు గురించి నాకు సమాచారం లేదు. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీ అంశం" అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి చెప్పారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌లలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శాసనసభ్యులు, మంత్రులు తరచూ తనను కలుస్తారని, దాన్నే మీడియా, మరికొందరు రాజకీయ దృక్పథంతో చూస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్‌, మహబూబ్‌ నగర్‌ రావడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవన్నారు. సొంత కార్యక్రమాల మీదే రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. జగన్‌ ఓదార్పు యాత్ర పార్టీ అధిష్ఠానం చూసుకోవాల్సిన అంశమని, దీనిపై తాను మాట్లాడాల్సిందేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణను సున్నితమైన సమస్యగా ఆయన అభివర్ణించారు. తెలంగాణపై కేంద్ర మంత్రిగా తన అభిప్రాయాన్ని ప్రధానమంత్రి లేదా, పార్టీ అధ్యక్షురాలికి వివరించాలి గాని బహిరంగంగా చెప్పడం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+