హైదరాబాద్: అవినీతి నిరోధక చట్టంపై సవరణలో తాము పూపోందిచిని బిల్లుని ప్రభుత్యం చట్టం చేయకపోతే ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేయడానికి చోరవ తీసుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబుకు లోక్ సత్తా పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టాలని తమపార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ ఇప్పటికే చంద్రబాబుతో మాట్లాడారని పేర్కోన్నారు. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాణ అధ్యక్షడు వర్మ తెలిపారు. అధికారంలోకి వస్తే అవినీతిపరుల ఆస్తుల్ని జప్తు చేస్తామంటూ బాబు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. మరోవైపు రెవెన్యూ రికవరీ, ఇతర చట్టాల ద్వారా ఆస్తులను జప్తు చేయిస్తామని చెప్పడం సమస్యపై ఆయన దాటవేత ధోరణికి నిదర్సన మన్నారు. తాము రూపోందించిన బిల్లుతో అవినీతి నిరోదక చట్టాన్నిపూర్తి స్దాయిలో బలోపేతం చేయచ్చున్నారు. ఇది అమలులోకి వస్తే ప్రజాప్రతినిధులు ఎవరూ అవినీతికి పాల్పడితే తప్పించుకోలేనన్నారు. ప్రస్తుతం రాడకీయం మాఫియాలా మారిందని. ప్రకృతి వనరులను సైతం దోచుకుంటున్నారని ఆరోపించారు.