సొంత ఎజెండాతోనే వైయస్ జగన్ ఓదార్పు యాత్ర: రాయపాటి

తెలంగాణ రోడ్లపై తిరగనివ్వమంటూ భయపెట్టడం, బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం అక్కడి నేతల అజ్ఞానానికి నిదర్శనమని రాయపాటి వ్యాఖ్యానించారు. ఇదే విధంగా రెచ్చగొడితే నష్టపోయేది తెలంగాణాయేనని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెసుకు ప్రత్యేక పీసీసీ ఏర్పాటు చేయాలంటూ అక్కడి కాంగ్రెసు ఎంపీలు డిమాండ్ చేయటాన్ని రాయపాటి తప్పుబట్టారు. అసలువాళ్లు కాంగ్రెసులో ఉన్నారా అనే అనుమానం వస్తోందన్నారు. తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు వ్యక్తిత్వం లేకుండా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. కాంగ్రెసు కార్యాలయాల్లో తెలంగాణ విమోచన దినం పాటించాలని అజ్ఞానులే చెబుతారని విమర్శించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక అధిష్ఠానం నిర్ణయంతో పీసీసీ ఏర్పడుతుందనే విషయం గమనించాలని ఆయన సూచించారు. బయట తిరగనివ్వమంటూ బెదిరించేందుకు ఆ రోడ్లు ఎవడబ్బ సొమ్మంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదే కొనసాగితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కష్టమేనన్నారు. 'తెలంగాణ విషయాన్ని యూపీఏ నేత సోనియాగాంధీ చేతిలో పెట్టాం. ఆమె శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఉండాల్సిన సమయంలో కయ్యానికి కాలుదువ్వటం భావ్యం కాదు. కాంగ్రెసు అధిష్ఠానం తీసుకునే నిర్ణయం శిరోధార్యం' అని ఆయన అన్నారు. గండిపేట నీళ్లు తాగి బలిశారంటూ విమర్శించటం సరికాదన్నారు. తాము కృష్ణ, గోదావరి నీరు తాగుతున్నామని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications