వైయస్ జగన్ మహా దర్జా లూటీ ఐడియా సరస్వతి బాగోతం

తన తండ్రి అధికారాన్నే తన ఐడియాగా మలచుకుని కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకునేందుకు చాలా పథకాలు, పన్నాగాలు సిద్ధం చేసుకున్నారనటానికి మరో సాక్ష్యం సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ సంస్థ అని రాసింది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా పెట్టుబడులు రాబట్టడం..వాటాలు అమ్మి అంతిమంగా ధనరాశులు కురిపించుకోవడం..స్వతంత్ర భారత, కార్పొరేట్ రం చరిత్రలో ఎవరికీ తట్టని, మరెవరికీ సాధ్యం కాని మహా దర్జా లూటీ ఐడియాగా ఈనాడు దినపత్రిక దాన్ని అభివర్ణించింది. భారతీ సిమెంట్స్ తో ఆ వినూత్న పథకాన్ని అమల్లో పెట్టి తన రూ. 45 కోట్ల పెట్టుబడిని కేవలం మూడున్నరేళ్లలోనే రూ.3.053 కోట్లకు చేర్చుకున్న జగన్ సరిగ్గా ఇదే తరహాలో సరస్వతి పేర మరో భారీ ప్రణాళిక సిద్ధం చేశారని వ్యాఖ్యానించింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రెండో దఫా విజయం సాధించిన సరిగ్గా రెండు రోజులకే జగన్ కు చెందిన 'సరస్వతీ పవర్'కు గుంటూరు జిల్లాలో అత్యంత విలువైన 6,680 లక్షల టన్నుల సున్నపు రాయి నిక్షేపాలను ధారాదత్తం చేస్తూ జీవో (నెం.107) జారీ అయిపోయిందని ఈనాడు దినపత్రిక ఆరోపించింది. అధికారం ఆసరాతో.. రాష్ట్ర గనుల శాఖను తమ జేబు సంస్థగా మార్చుకుని..రాష్ట్రంలోని గనులు, సహజ వనరులను నిరాఘాటంగా కొల్లగొట్టటం ద్వారా తేలికగా ఎన్ని వేల కోట్లను వెనకేసుకోవచ్చో 'భారతీ సిమెంట్స్' విషయంలో ప్రత్యక్షంగా రుచి చూసిన వై.ఎస్. కుటుంబం.. తమ తదుపరి ధనార్జన ప్రాజెక్టుగా ఈ 'సరస్వతి'ని సిద్ధం చేసిందని వ్యాఖ్యానించింది. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని తమ కోట గుమ్మానికి కాపలాగా వేళ్లాడగట్టి.. లోపల ఇష్టారాజ్యంగా కాసుల పుట్టలు తవ్వుకోవటం ఆరంభించిన వైఎస్ కుటుంబానికి ఈ 'సరస్వతి' ఎన్ని వేల కోట్లను కుమ్మరించబోతోందో ఈనాడు దినపత్రిక వివరించింది.












Click it and Unblock the Notifications