న్యాయవాదుల చలో హైకోర్టు, ధర్నాలతో ఉద్రిక్తత

ధర్నా కారణంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. అయితే ప్రభుత్వం ఏదో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికా అన్నట్టు అక్కడ ధర్నా చేస్తున్న న్యాయవాదుల కన్నా పోలీసులే ఎక్కువ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఐడి కార్డులున్న జడ్జిలు, న్యాయవాదులనే పోలీసులు కోర్టులోకి అనుమతిస్తున్నారు. ధర్నా కారణంగా ట్రాఫిక్ జాం అయింది. తెలంగాణ లాయర్ల ఐకాస నాయకుడు వెంకట్ యాదవ్ మాట్లాడుతూ 42 శాతం వాటా వచ్చే వరకు తమ ఉద్యమం ఆపేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం తెలంగాణ పట్ల చిన్న చూపు చూస్తుందన్నారు.
హైకోర్టు ఎదుట తెలంగాణ లాయర్ల ఐకాస ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ధర్నాకు మద్దతుగా తెలంగాణలోని వరంగల్, నల్గొండ వంటి పలు ప్రాంతాల్లో జిల్లా సెషన్స్ కోర్టులలో న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి మద్దతు తెలిపారు.












Click it and Unblock the Notifications