హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ మైనింగ్ పై సోనియా మౌనంపై బాబు ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: అక్రమ మైనింగ్ పై చంద్రబాబు నాయుడు మరోసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. కాంగ్రెసు ప్రభుత్వం మూలనపడ్డ సిద్ధాంతాలతో మైనింగ్ లను అక్రమార్కులకు అడ్డదిడ్డంగా కట్టిపెట్టిందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఘాటుగా విమర్శించారు. నాణ్యమైన ఇనుము, స్టీల్, బెరైట్స్, బాక్సైట్ గనులకు ప్రపంచవ్యాప్తంగా బాగా డిమాండ్ పెరగడంతో మన రాష్ట్రంలో కొందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని మైనింగ్ ను కొల్లగొడుతున్నారన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలోని మైనింగ్ కొల్లగొట్టి అక్కడి గిరిజనుల జీవితాలతో ఆడుకుంటాన్నారన్నారు. వేదాంతపై స్పందించిన ప్రభుత్వం ఓబుళాపురం, బయ్యారం, రక్షణ, నేటి సరస్వతి అక్రమాలపై నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. జాతి ప్రయోజనాలకు ఉపయోగపడాల్సిన సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలిస్తున్నారన్నారు. దీంతో భవిష్యత్తు తరాలకు నష్టం వాటిల్లే ప్రయోజనం ఉందన్నారు. మైనింగ్ అక్రమాలపై కర్ణాటక ముఖ్యమంత్రి ఘాటాగా స్పందిస్తుంటే, రోశయ్య మాత్రం ఫైల్ తెప్పించుకొని చూస్తానంటూ మీనామేషాలు లెక్కిస్తున్నారు. ఇన్ని అక్రమాలు బయటపడ్డా నాటి రక్షణనుగాని, నేటి సరస్వతినిగాని ఎందుకు రద్దు చేయటం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు ఏం చేయాలో కూడా కొందరు రాజపుత్రులకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. 2001 నుండి 2008 మధ్య 6లక్షల 50వేల కోట్ల రూపాయల నల్లధనం బయటి దేశాలకు వెళ్లినట్లు ఓ అధ్యయనం తేల్చిందని, అంటే ఎన్ని లక్షల కోట్ల అక్రమాలు జగుతున్నాయో తెలుసుకోవచ్చన్నారు. మైనింగ్ మాత్రమే కాకుండా మట్టిని సైతం తవ్వి బంగారాన్ని సృష్టించుకున్నారని, దాంతో సామాన్యులు ఇందులో సమిధలు కావాల్సి వస్తోందన్నారు. మైనింగ్ ఐనా, అటవి సంపద ఐనా, మట్టి ఐనా జాతి సంపద, అంటే అది ప్రజలది. కాబట్టి ఆ ఆస్థిని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకునే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. అధికారం కోసం ఎలాంటి దుశ్చర్యలకైనా కొందరు వెనకాడటం లేదని, దానిని చేతకాని రోశయ్య ప్రభుత్వం చూస్తూ కూర్చుందన్నారు. వారిని ఎమైనా అంటే తన పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్టు ఉన్నారని దుయ్యబట్టారు.

సోనియాగాంధీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలకు పూనుకోకపోవడంపై చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. అక్రమార్కులకు భయపడో లేక వారితో కుమ్మక్కు కావటం వల్లనే ఆమె నోరుమెదపటం లేదన్నారు. రోశయ్య, సోనియా గాంధీలు ఊరుకున్నప్పటికీ ప్రజల సొమ్ము లూటీ చేస్తుంటే ఊరుకునేది లేదని, దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని అయన హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X