విజయనగరం: తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ఓదార్పు యాత్ర చేస్తున్న కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను కేంద్ర మంత్రి పళ్లంరాజు బలపరుస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆయన మాటలు ఆ అనుమానాలకు కారణమవుతోంది. వైయస్ జగన్ పై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. జగన్ పై అధిష్టానం చర్యలు తీసుకుంటోందనేది కొంత మంది సృష్టి అని ఆయన వ్యాఖ్యానించారు.
వైయస్ జగన్ కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే జగన్ కొంత కాలం సహనం వహించాలని ఆయన సూచించారు. కడప జిల్లాలో రెండో విడతలో సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.