రామోజీ రావు అసలే కోతి, ఆపై కల్లు తాగింది: సాక్షి వ్యాఖ్య

సాక్షి దినపత్రిక చేసిన వ్యాఖ్యలు, సమర్థింపులు ఈ విధంగా ఉన్నాయి - ఆరున్నొక్క రాగంలో రామోజీ 'ఐడియా" గోల, లాభాలు తప్పు... నష్టాలు ఒప్పు...సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ బాబు అధికారం వెలగబెడుతున్న రోజుల్లోనే ఏర్పడింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నా మిగతా దరఖాస్తుదారుల మాదిరే ఏడాదిన్నర తర్వాతే అనుమతి లభించింది. ఇదే కాలంలో మరెన్నో సంస్థలకు పార్టీలతో నిమిత్తం లేకుండా మైనింగ్ లీజులు మంజూరయ్యాయి. గుంటూరు జిల్లాలో భూములను మార్కెట్ రేటుకే కొనుగోలు చేసింది అనుమతి ముందే వస్తుందని ఊహించి భూములు కొన్నారని మతిలేని ఆరోపణ... తొలి దరఖాస్తు అయితే ప్రథమ ప్రాధాన్యం ఉంటుందన్న కనీస జ్ఞానం లేకుండా బురదజల్లే ఆలోచన ఇది జగన్ తాను లాభాలు పొందుతూ వాటాదారులకు కూడా లాభాలు తెచ్చారు... రామోజీలాగా పైసా లేకుండా జనం సొమ్ముతో వ్యాపారం నడిపి డబ్బు దండుకోలేదు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, రామోజీపై సాక్షి దినపత్రిక వార్తాకథనం వ్యాఖ్యలు ఇంకా ఈ విధంగా ఉన్నాయి - ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టండంటూ ముఖ్యమంత్రిగా దావోస్, దుబాయ్, మలేసియా, సింగపూర్, ఐరోపాలతోపాటు ప్రపంచం మొత్తం తిరిగి, చివరకు తన ప్రయాణం ఖర్చులంత ఎఫ్‌డీఐ కూడా రాబట్టలేని చంద్రబాబు నాయుడు చేతగాని తనాన్ని కప్పిపెట్టేందుకు 'ఈనాడు" అప్పట్లో పడిన తాపత్రయం ఎంతెంత? ఆయన తీసుకువచ్చినదల్లా బినామీ ఎమ్మార్, బినామీ ఐఎంజీలను! హైదరాబాద్ లో పార్ట్ నర్ షిప్ సమిట్‌లని పెట్టి లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వస్తున్నాయని కోసిన బాబు, వందల కోట్ల పెట్టుబడులు కూడా రాబట్టలేకపోయాడని నిరూపణ అయినా...ఈనాటికీ చంద్రబాబు 'ఈనాడు" పాలిట ద గ్రేటే! ఈ రాష్ట్రంలోనే ఒక యువ పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టి కర్మాగారాన్ని నెలకొల్పి లాభాలు సంపాదిస్తానంటే మాత్రం రామోజీకి చిర్రెత్తుతోంది.












Click it and Unblock the Notifications