న్యాయదేవత కొంగు లాగుతున్నారు: తెలంగాణ లాయర్లపై ఆనం

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగు పరచాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆరే ఓ సెటిలర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీకి అమెరికా పౌరసత్వం కూడా ఉండవచ్చునని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థలో ప్రాంతాలవారీ వాటాపై అన్ని ప్రాంతాలవారి అభిప్రాయం తీసుకోవాలని ఆయన అన్నారు. అన్యాయం జరిగిందని భావిస్తే తెలంగాణ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించవచ్చునని ఆయన అన్నారు. తెలంగాణ న్యాయవాదుల ఆందోళన వల్ల తలెత్తిన పరిణామాలపై కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు శుక్రవారం సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications