హైకోర్టులోని న్యాయవాదుల ఆమరణ నిరాహార దీక్ష భగ్నం

మొత్తానికి పోలీసులు వారిని 108 అంబులెన్సులోకి బలవంతంగా ఎక్కించారు. అక్కడి నుంచి వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా పోలీసులు బలవంతంగా వారిని తరలించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు-న్యాయవాదుల మధ్య తీవ్రంగా పెనుగులాట జరిగింది. అంతకుముందు గురువారం సాయంత్రం దీక్షలో ఉన్న న్యాయవాదులను ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల బృందం పరీక్షించింది. నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వారి శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతోందని, దీక్షలు కొనసాగిస్తే ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉన్నందున వెంటనే చికిత్స అందించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications