హైకోర్టుకు లాయర్ల ర్యాలీ, ఉద్రిక్తత, పోలీసుల లాఠీచార్జీ

Telangana Lawyers
హైదరాబాద్: హైకోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏ మాత్రం తగ్గడం లేదు. తమ వాటా కావాలని తెలంగాణ న్యాయవాదులు డిమాండ్ చేయటం, దానిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటంతో పరిస్థితి సద్దుమణగటం లేదు. తాజాగా పోలీసులు అతిగా ప్రవర్తించి న్యాయవాదులపై లాఠీచార్జీ చేశారు. బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి తన ఐడెంటిటీ కార్డు చూపించి కోర్టు లోపలకు వెళ్లడానికి ప్రయత్నించాడు. ఐడీ కార్డు చూపించినప్పటికీ పోలీసులు ఆయన్ను లోపలకు పంపడానికి అనుమతించలేదు. దీంతో ఆయన కోర్టు ఎదుట దీక్షకు పూనుకున్నారు. ఐడీలు చూపించినప్పటికీ లోపలికి పంపక పోవడంపై కొందరు న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కోర్టు లోపలకు చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు, న్యాయవాదులకు మధ్య తోపులాట జరిగింది. రెచ్చిపోయిన పోలీసులు న్యాయవాదులపై లాఠీచార్జీ చేశారు. నిరసన తెలుపుతున్న న్యాయవాదులపై లాఠీచార్జీ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు హైకోర్టుకు బయలుదేరారు.

నిరసనకు మద్దతు తెలపడానికి రంగారెడ్డి, నాంపల్లి కోర్టు న్యాయవాదులు సిటీ సివిల్ కోర్టులో సమావేశమైనారు. అనంతరం హైకోర్టుకు ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వీరిని మధ్యలోనే అడ్డుకొనడానికి ప్రయత్నించారు. న్యాయవాదులు మాత్రం వెనక్కు తగ్గకుండా కోర్టుకు బయలుదేరారు. ఐతే పోలీసులు వీరిని మదీనా వద్దకు వచ్చిన తర్వాత అడ్డుకొని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని సిటీ అవుట్ స్కర్ట్స్ లలో ఉన్న బొల్లారం తదితర పోలీస్ స్టేషన్ లకు తరలించారు. తెలంగాణ న్యాయవాదులను చర్చలకు ఆహ్వానించడానికి ఇద్దరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వెళ్తున్నారు. మంత్రి గీతారెడ్డి ఆదేశాల మేరకే తాము న్యాయవాదుల వద్దకు వెళ్తున్నట్లు ఎంపి మధు యాష్కీ చెప్పారు.

హైకోర్టు ఆదేశాల మేరకే కోర్టు ఆవరణలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ తెలిపారు. కోర్టు మరోసారి ఆదేశాలు ఇచ్చేవరకూ బందోబస్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కాగా హైకోర్టులోకి అనుమతులు, పాస్‌లు లేకుండా ఎవరినీ అనుమతించవద్దని జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ నౌషద్ బెంచ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+