హైదరాబాద్: నేటినుంచి జరుగనున్న నినాయక నిమజ్జనంపై నగర పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్ సోమాజీగూడ జయాగార్డెన్స్‌లో పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. గణేశ్ నిమజ్జనానికి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే టాంక్ బండ్ ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 22వేలమంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అవసరముంటే మరిన్ని బలగాలను పంపిస్తామని ఖాన్ అధికారులకు సూచించారు. గణేశ్ నిమజ్జనంతో పాటు ఈనెల 24న అలహాబాదు కోర్టులో అయోధ్య కేసుపై ఫలితం తేలనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోసుచేసుకోకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు.