తెలంగాణ లాయర్ల కు హైకోర్టులో సముచిత న్యాయం చేస్తాం

అంతేకాకుండా అయా ప్రాంతాల్లో ఆయా వర్గాల వారికి సైతం సముచిత న్యాయం చేసే దిశలో ఆలోచిస్తామన్నారు. ఇందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బిసిలకు రావాల్సిన వాటాలను పరిశీలిస్తామన్నారు. మంత్రి మోపిదేవి తెలంగాణకు అన్యాయం ఎక్కడా జరగలేదని చూపడం సరి కాదని,అందులో చాలామంది సీమాంధ్రులు ఉన్నారని తెలంగాణ న్యాయవాదులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని పరిశీనిస్తామని మంత్రివర్ద ఉపసంఘం పేర్కొంది.
అంతకుముందు రోజు హైకోర్టులో 42శాతం వాటాకోసం పోరాడుతున్న న్యాయవాదులకు మద్దతుగా నామినేట్ న్యాయవాద పదవులకోసం మధుయాస్కీ మధ్యవత్వంలో న్యాయవాదులకు, మంత్రివర్గ ఉపసంఘానికి జరుగుతున్న చర్చలు కొలిక్కి రాలేదు. మంత్రివర్గ ఉపసంఘానికి నేతృత్వం వహిస్తున్న గీతారెడ్డి - ఈ చర్చల సారాంశాన్ని తోటి మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసి వివరించిన విషయం తెలిసిందే.హైకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశంపై విధించిన నియంత్రణలను కాస్త సడలించాలని దాఖలైన పిటిషన్‌ను మన్నించింది. కోర్టు న్యాయవాదుల ధర్నా, పోలీసుల కవాతుతో సుమారు వారం పాటు దద్దరిల్లిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications