లారా దత్త నా కాపురాన్ని కూల్చింది: భూపతి మాజీ భార్య శ్వేత
National
oi-Pratapreddy
By Pratap
ముంబై: బాలీవుడ్ నటి లారా దత్తాపై టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి మాజీ భార్య శ్వేత జయశంకర్ నిప్పులు చెరిగింది. తన కాపురాన్ని కూల్చిందని మండిపడింది. తన కాపురాన్ని కూల్చిందని ఆరోపించింది. మహేష్ భూపతి తనను మోసం చేసి లారా దత్తాకు చేరువయ్యాడని అన్నది. మోడల్ శ్వేత జయశంకర్ 1998లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ గా ఎంపికయ్యింది. ఆ తర్వాత మహేష్ భూపతిని పెళ్లి చేసుకుంది. తాము విడాకులకు దరఖాస్తు చేయడానికి ముందు నుంచే మహేష్ భూపతి లారా దత్తాతో డేటింగ్ చేస్తూ వచ్చాడని శ్వేత ఆరోపించింది.
సెప్టెంబర్ 19వ తేదీన లారా దత్తా, మహేష్ భూపతిల నిశ్చితార్థం జరిగింది. న్యూయార్క్ లో ఈ నిశ్చితార్థం జరిగినట్లు మహేష్ బూపత్ ట్విట్టర్ లో రాసుకున్నాడు. వివాహం తేదీ ఖరారు కావాల్సి ఉంది.