కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలు ఉత్తవే: తులసి రెడ్డి

Tulasi Reddy
హైదరాబాద్: కాంగ్రెసు ఎంపీ వైయస్ జగన్ మామ, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి రోశయ్యపై చేస్తున్న వ్యాఖ్యలు సరికావని పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఎవరిపైనా కక్ష సాధింపు ఉద్ధేశ్యాలు లేవని, ఆయన రాజకీయ జీవితంలో అలాంటివి ఎప్పుడైనా కనిపించాయా అని ఆయన ప్రశ్నించారు. రవీంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన నాలుగు ప్లాంట్లపైనే సోదాలు జరపలేదని, రాష్ట్రంలో ఉన్న 20 మిక్సింగ్ ప్లాంట్లలలో సోదాలు జరిపిన విషయం తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష్య లేదని ఆయన తెలిపారు.

మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, దామోదర రాజనర్సింహలపై ఉస్మానియా ఐకాస చేసిన వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. మంత్రులను తెలంగాణలో తిరగనివ్వమని భయపెట్టడం చిన్న పిల్లల చేష్టల మాదిరిగా ఉందన్నారు. విద్యార్థులు అలా ప్రవర్తించకూడదని, చదువుపైనే దృష్టి సారించాలన్నారు. రవీంద్రనాథ్ రెడ్డిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని, నిబంధనల ప్రకారమే రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలుంటాయని మంత్రి దానం నాగేందర్ విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు.

మున్సిపల్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం వెనుకంజ వేయలేదని, కొన్ని సమాచార సాధనాలు ప్రభుత్వం వెనుకంజ అని రాస్తున్నాయని అది సరి కాదన్నారు. మున్సిపల్ ఎన్నికలలో మహిళలను 33 శాతం వాటా విషయం నేపథ్యంలో ఎన్నికలు ఆలస్యమవుతున్నాయి తప్పితే వేరే ఏ కారణము లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+