హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాగార్జున రెడ్డి రాజీనామా ఉపసంహరణ చెల్లదంటూ కోర్టులో పిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagarjuna Reddy
హైదరాబాద్: హైకోర్టు జస్టిస్ నాగార్జునరెడ్డి తన రాజీనామా ఉపసంహరణ చెల్లదని హైకోర్టులో ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు అయ్యింది. ప్రముఖ న్యాయవాది ఆర్. చంద్రశేఖర్ రెడ్డి గురువారం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఒక న్యాయమూర్తి స్థానంలో ఉండి ఆవేశాలతో నిర్ణయం తీసుకుంటే అది రాజ్యాంగానికి విరుద్దమని పిల్ దాఖలు చేసిన చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. న్యాయమూర్తి అన్ని ఉద్యోగాల్లా కాదని, బుల్లెట్ ఒకసారి పేల్చితే ఎలా అయితే బయటకు రాదో, ఒక న్యాయమూర్తి రాజీనామా కూడా మళ్లీ ఉపసంహరణకు వీలు లేదన్నారు. న్యాయమూర్తి ఆవేశంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ రాజీనామా ఉపసంహరణ చెల్లదన్న ధోరణి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఉందన్నారు.

గత వారం తెలంగాణవారికి హైకోర్టులో 42 శాతం వాటా కావాలని తెలంగాణవాదులు నిరాహార దీక్ష, నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణవాదం పేరుతో బాధ్యతయుత వృత్తిలో ఉన్న తెలంగాణ న్యాయవాదులు కోర్టు పనులు అడ్డుకున్నారని, హైకోర్టు ప్రతిష్టను దెబ్బ తీసేలా ప్రవర్తించారని జస్టిస్ నాగార్జునరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కక్రూకు, రాష్ట్రపతినికి ఫ్యాక్స్ ద్వారా లేఖను పంపారు. రెండు రోజుల పాటు ప్రధాన న్యాయమూర్తి కక్రూగాని, మరికొందరు న్యాయవాదులు రాజీనామా ఉపసంహరించు కోవాల్సిందిగా విజ్జప్తి చేసినప్పటికీ ఆయన తోసిపుచ్చారు. అనంతరం రెండు రోజుల తర్వాత తెలంగాణ లాయర్లతో ప్రభుత్వం చర్చలు జరుపుతామని మాట ఇచ్చిన అనంతరం తెలంగాణ లాయర్లు నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఆ తర్వాత నాగార్జునరెడ్డి కూడా హైకోర్టు ప్రతిష్ట పునరుద్దరించడంలో భాగంగా తను రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. దాంతో పరిస్థితి సద్దుమణిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X