విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ మిత్రుడు సింహాద్రి సత్యనారాయణ కన్నుమూత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Simhadri Satyanarayana
విజయవాడ: మాజీమంత్రి సింహాద్రి సత్యనారాయణ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడలోని ఓ వైద్యశాలలో మరణించారు. అయన రాష్ట్రానికి మూడు పర్యాయాలు మంత్రిగా చేశారు. ఆయన ఆరోగ్యం గత కొద్దికాలంగా బాగుండక పోవటంతో హాస్పిటల్లో చేర్పించారు. హైదరాబాద్ లోని హాస్పిటల్లో చూపించారు. అనంతరం మళ్లీ ఆరోగ్య సమస్యలు రావటంతో విజయవాడలోని నాగార్జున హాస్పిటల్లో చేర్పించారు. ఆయన హాస్పిటల్లోనే కన్నుమూశారు.

1929 అక్టోబర్ 19న ఆవనిగడ్డలో జన్మించిన ఆయన లా చదివారు. 30 ఏళ్ల పాటు న్యాయవాదిగా ఆవనిగడ్డలోనే పని చేశారు. ఆనంతరం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీపై అభిమానంతో మొదటినుండి ఆ పార్టీలో పని చేశారు. 1985లో తెలుగు దేశం పార్టీ ఆయనకు ఆవనిగడ్డనుండి పోటీ చేయడానికి టిక్కెట్ ఇచ్చింది. మొదటిసారి పోటీ చేసిన ఆయన గెలిచారు. ఆనంతరం 1988లో పోటీ చేసి గెలిచాడు. ఎన్టీఆర్ సింహాద్రి ఈమారు దేవాదాయశాఖను అప్పగించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తున్న తరుణంలో సైతం ఆయన స్వల్ప ఆధిక్యంతో గెలిచారు.

1995లో విజయవాడనుంచి పోటీ చేసి గెలిచారు. వాణిజ్య మంత్రిత్వ శాఖను ఆయనకు అప్పగించారు. 1999లో రాజకీయాలంటే విరక్తి పుట్టిన ఆయన రాజకీయాలకు స్వస్తీ చెప్పారు. ఆయితే 2004లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి నేటి అవినీతి రాజకీయాలతో పోటీ పడి గెలవలేక పోయారు. రెండుసార్లు దేవాదాయ శాఖను చేపట్టడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆయన్ను దేవుడి మంత్రిగా పిలుస్తారు. నిజాయితీకి ఆయన నిలువుటద్దం. ఎన్నికల్లో వాగ్ధానాలు చేస్తే వాటిని తప్పకుండా ఆమలు పరిచేవారు. ఇప్పటి రాజకీయ నాయకులలాగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలెయ్యటంలా కాకుండా గెలిచిన తర్వాత ప్రజల్లో ఉండి వారి సాధక బాధలను గమనించేవాడు. ఆ ప్రాంతంలో ఆయన హయాంలో పలు టిటిడి మండపాలు కట్టించారు. ఎత్తిపోతల పథకాలకు భారీ నిధులు కేటాయించారు. గతంలో లోక్ సత్తా పార్టీ రాష్ట్రంలోని నిజాయితీగల రాజకీయ నాయకుల పేర్లను ప్రకటించింది. అందులో సింహాద్రి సత్యనారాయణనే మొదటి స్థానంలో ఉండటం ఆయన రాజకీయ జీవితం ఎంత స్వచ్ఛమైనదో చెబుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X