హైదరాబాద్: రానున్న దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా 129 ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. విజయవాడ, విశాఖపట్నం, పక్క రాష్ట్రాల్లోని అజ్మీరా, బికనీర్ ల మధ్య ఈ రైళ్లను నడుపుతున్నట్ట తెలిపింది. సికింద్రాబాద్ విశాఖ మధ్య 18, సికింద్రాబాద్ విజయవాడ మధ్య 9, హైదరాబాద్ అజ్మీర్ మధ్య 18, సికింద్రాబాద్ బికనీర్ మధ్య 16 రైళ్ళను నడపునున్నట్లు తెలిపారు. రేపటి నుంచి నాలుగు కొత్త రైళ్ళను ఇక్కడి నుంచి ప్రారంభిస్తామని పేర్కొన్నది.మరికొన్ని ప్రాంతాలకు నడపనున్నట్లు తెలిపింది. ఎక్కువ ప్రజలు ప్రయాణించే నగరాలను ఎన్నుకొని వాటిని సైతం త్వరలో నడుపనున్నట్లు ప్రకటించారు.ఛార్జీలు ఎక్కువగా ఏమీ వసూలు చేయమని, అవే ఛార్జీలు ఉంటాయన్నారు.