అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న సున్నీ వక్ఫ్ బోర్డు

అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వక్ఫ్‌బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ కూడా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వివాదాస్పద ప్రాంగణంలో రామజన్మభూమి ఉందని కోర్టు చెప్పిందని, అదే సమయంలో నమాజ్ చేసే ప్రాంతంలో మసీదు ఉందంటూ మేం చేస్తున్న వాదనను కూడా కోర్టు సమర్థించిందని వివాదాస్పద ప్రాంతాన్ని విభజనకు ఇచ్చేది లేదని జిలానీ స్పష్టం చేశారు. హైకోర్టు చెప్పిన ఫార్ములాను వక్ఫ్‌బోర్డు ఆమోదించడం లేదన్నారు. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేందుకు సున్నీ వక్ఫ్‌బోర్డు సుముఖంగా ఉందని, ప్రతిపాదన అంటూ వస్తే చర్చలు ప్రారంభమవుతాయన్నారు.
వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా విడగొట్టాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తామని భారత్ హిందూ మహాసభ ప్రకటించింది. రామజన్మభూమి వివాదం కేసులో భారత్ హిందూ మహాసభ కూడా ఒక వాదిగా ఉంది. రామజన్మభూమి కోసం మేం చేస్తున్న పోరాటాన్ని ధర్మాసనం మొత్తం గుర్తించిందని భారత్ హిందూ మహాసభ అధ్యక్షుడు కమలేష్ తివారీ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications