ప్రధాని పదవిపై కన్నేసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు?

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రధాని పదవిపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కన్నేసినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలను బట్టి చూస్తే ఆ విషయం అర్థమవుతోంది. చంద్రబాబు ప్రధాని కావాలని శాసనసభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విడివిడిగా అన్నారు. చిత్తూరు జిల్లా ప్రజలు చంద్రబాబు ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలు మాత్రం ముఖ్యమంత్రిగా ఉండి స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం పనిచేయాలని ఆశిస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అయితే, చంద్రబాబు ప్రధాని అయితే దేశానికి మేలు జరుగుతుందని, దేశం అభివృద్ధి చెందుతుందని గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. చంద్రబాబు ప్రధాని అయితే దేశ సమస్యలను పరిష్కరించగలరని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అవుతుందని తెలుగుదేశం నాయకులంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని చంద్రబాబు కూడా ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు. బిజెపికి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసే పనిలో మరోసారి ఆయన గట్టిగా కృషి పెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇవియంలపై ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీలో ఉన్నారు. ఈ అవకాశాన్ని ఆయన వామపక్షాలు, ఇతర పార్టీలతో చర్చించేందుకు వినియోగించుకున్నట్లు చెబుతున్నారు.

కాగా, గుంటూరు, తిరుపతి, విశాఖల్లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలని ముద్దుకృష్ణమ నాయుడు కోరారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలను హైదరాబాదులో నిర్వహించాలని, హైదరాబాదును దేశం రెండో రాజధానిగా చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. వైయస్ జగన్ బెంగళూర్ లోని తన వైట్ హౌస్ లో లక్ష కోట్ల రూపాయలు దాచారని, ఆ గుట్టును రట్టు చేస్తామని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+