తొమ్మిదో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు
Districts
oi-Srinivas G
By Srinivas
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తన స్టూడెంట్ ను గర్భవతిని చేసి అతి దారుణానికి పాల్పడ్డాడు. జిల్లాలోని ముమ్మిడివరం మండలంలోని అనావతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినిని ఉపాధ్యాయుడే గర్భిణీని చేశాడు. ఆ విద్యార్థిని గర్భిణీ అయ్యిందని తెలిసి అక్కడినుండి పారిపోయాడు. ఇది తెలిసిన గ్రామస్తులు ఆ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకోవాలని పాఠశాలను చుట్టుముట్టి డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థిని తొమ్మిదవ తరగతి చదువుతోంది.ఉపాధ్యాయుడికి సహకరించాడని స్కూలులోని అటెండర్ పై గ్రామస్తులు దాడి చేశారు. దీంతో అక్కడి పరిస్ధితి ఉద్రిక్తంగా మారింది.