చంద్రబాబు హెరిటేజ్ ఫ్రెష్ లో చుక్కల్లో సరుకుల ధరలు

సాధారణ సూపర్‌మార్కెట్లతో పోల్చుకున్నా హెరిటేజ్ ధరలు ఎంతో ఎక్కువగానే ఉండటం గమనార్హం. సోనామసూరి బియ్యం సాధారణ రిటైల్ దుకాణంలో ఒక కిలోకు రూ. 28 నుంచి రూ.30 మధ్యన, సాధారణ సూపర్ మార్కెట్‌లో 35 చొప్పున లభిస్తుంటే హెరిటేజ్‌లో మాత్రం దీని ధర ఏకంగా రూ.40గా ఉంది. కందిపప్పు సాధారణ దుకాణంలో ఒక కేజీకి గరిష్టంగా రూ.62 వరకు ఉండగా... హెరిటేజ్‌లో రూ.95 ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. అంటే కిలోకి అదనంగా రూ.33 వసూలు చేస్తూ హెరిటేజ్ ప్రజలను అడ్డగోలుగా దోచుకుంటోందట. సాధారణ సూపర్ మార్కెట్లో కందిపప్పు ధర రూ.72 ఉంది. ఇక చక్కెర ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.29, సాధారణ సూపర్ మార్కెట్‌లో రూ.33 ఉండగా... హెరిటేజ్‌లో రూ.39 చొప్పున అమ్ముతున్నారు. గోధుమ పిండి సాధారణ మార్కెట్లో రూ.24 ఉండగా...బాబు గారి హెరిటేజ్‌లో రూ.33 వసూలు చేస్తున్నారు. సాధారణ సూపర్ మార్కెట్ లో హెరిటేజ్ కన్నా మూడు రూపాయలు తక్కువే ఉండటం గమనార్హం. బెల్లం సాధారణ మార్కెట్లో 900 గ్రాముల ప్యాకెట్టు రూ.28 ఉండగా...హెరిటేజ్ లో మాత్రం ఏకంగా రూ.65 ఉండటంతో మధ్య తరగతి ప్రజలు కళ్లు తేలేస్తున్నారు. నాణ్యతలో కొంత తేడా ఉంటుందనుకున్నా రెట్టింపు ధరకన్నా ఎక్కువగానే హెరిటేజ్ ధర ఉండటం గమనార్హం.
సాధారణ సూపర్ మార్కెట్‌లో దీని ధర రూ.48 మాత్రమే ఉండటాన్ని బట్టి హెరిటేజ్‌లో ధరలెలా మండిపోతున్నాయో అవగతమవుతుంది. అలాగే చింతపండు సాధారణ దుకాణంలో కిలో రూ.48కి లభిస్తుంటే హెరిటేజ్‌లో దాదాపు రెట్టింపు ధర రూ.95కు అమ్ముతున్నారు. సాధారణ సూపర్‌మార్కెట్‌లో చింతపండు ధర రూ.88గా ఉంది. ఇక ఉల్లిపాయలు సాధారణ మార్కెట్లో కిలో రూ.20 ఉంటే...హెరిటేజ్ లో రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ఏ వస్తువు ధర చూసినా హెరిటేజ్‌లో నిలువు దోపిడీయే కన్పిస్తోంది. పైగా హెరిటేజ్ ప్యాకెట్లపైన 'ఫార్మర్స్ ప్రైడ్" (రైతులకు గర్వకారణం)" అని ముద్రించారు. అంటే ఈ ధరలు రైతులు గర్వించేలా ఉన్నాయనా వీరి ఉద్దేశం? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications