మహబూబ్ నగర్: చెన్నై ఎక్సుప్రెస్సులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై ఎక్సుప్రెస్సులోని ఎస్-8 బోగీలోనే బాత్రూంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర కలవరం చెలరేగింది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల వద్ద అధికారులు అతని మృతదేహాన్ని కిందికి దింపారు. అతన్ని తమిళనాడుకు చెందిన తేని జిల్లావాసిగా గుర్తించారు. అతని పేరు టి. కుమార్ అని తెలుస్తోంది.
కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రయాణికుడు ఆత్మహత్య చేసుకోవడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, భయానికి గురయ్యారు. అధికారులు విచారణ చేపట్టారు.