క్రమంగా విలువలు దిగజారుతున్నాయి: ముఖ్యమంత్రి రోశయ్య

విషయ సేకరణ పూర్తిగా అయిన తరువాతనే వార్తలను ప్రచురించటం గాని, ప్రసారం చేయటం గాని చేయాలన్నారు. కేవలం మీడియాలోనే కాదని అన్ని రంగాల్లో విలువలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల మరీ దారుణమైన పరిస్థితులు తయారయ్యాయని అన్నారు. అయితే సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన మీడియా విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే పత్రికలలో పనిచేసే వాళ్లకే కాదు అందరికీ విలువల పట్ల నిబద్దత ఉండాలన్నారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు మీడియా ప్రతినిధులు ఇందిరాపార్కు నుండి మదుపు చంద్రయ్య గార్డెన్ వరకు మీడియా మార్చ్ నిర్వహించారు.












Click it and Unblock the Notifications