గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై చంద్రబాబు అనుమానాలు

ఈ నెల 9వ తేదీన గద్దర్ ఫ్రంట్ విధివిధానాలు వెల్లడవుతాయని పార్టీ నాయకులు ఆయనకు చెప్పారు. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ పై స్పష్టత వచ్చే వరకు దానిపై మౌనంగా ఉండాలని, ఎవరు కూడా మాట్లాడకూడదని చంద్రబాబు పార్టీ నాయకులను ఆదేశించారు. గద్దర్ తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటుపై పొలిట్ బ్యూరోలో విస్తృతంగా చర్చించారు. కాగా, పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై సమావేశంలో చర్చ జరగలేదని తెలుస్తోంది. ప్రజాఫ్రంట్ పై నాగం జనార్దన్ రెడ్డి చేసిన ప్రకటనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతోనే ఆయన సమావేశం మధ్యలో లేచి వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications