విశాఖపట్నం: తమకు ఉద్యోగులు ఇవ్వాల్సిందేనంటూ గంగవరం పోర్టు నిర్వాసితులు మరోసారి ఆందోళనకు దిగారు. తమకు ఉపాధి కల్పించాలంటూ 15 మంది మత్స్యకారులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. అయితే దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అధికారులు ఇంతకు ముందు తమకు హామీ ఇచ్చారని, వారి హామీల మేరకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. తమ జీవన భృతిని ప్రభుత్వం కొట్టిందని, అప్పుడు ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి మూడేళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు కల్పించక పోవటంపై వారు ఆగ్రహించారు. వేటకు వెళ్లే దారిలో పోర్టు 15 అడుగుల ఎత్త్తెన ప్రహరీని నిర్మించడంతో తాము పూర్తిగా ఉపాధి కోల్పోయామని, తమకు ఉద్యోగాలు కల్పించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని, తామకు ఉద్యోగాలు కల్పించకుంటే తాము ఆత్మహత్యలకు కూడా సిద్ధమని వారు అంటున్నారు.