ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఖమ్మం జిల్లాలో మళ్లీ పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Khammam Dist
ఖమ్మం: గత మూడేళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న ఖమ్మం జిల్లాలో మళ్లీ కాల్పుల మోతలు ప్రారంభం అయ్యాయి. బుధవారం వేలేరుపాడు మండలంలోని గుండ్లమడుగు గ్రామం దగ్గర అశ్వారావుపేట అడవుల్లో నక్సలైట్లు సమావేశం అవుతున్నారనే సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయాన్నేకూంబింగ్ కోసం వెళ్లారు. అయితే పోలీసులు వస్తున్న సమాచారాన్ని తెలుసుకున్న నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారు. అనంతరు కొద్దిసేపు ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. పోలీసులపై కాల్పులు జరుపుతూ నక్సలైట్లు పరారయ్యారు.

నక్సలైట్లు పరారయిన తర్వాత వారు సమావేశం అయిన ప్రాంతంలో కిట్ బ్యాగులు, వంటసామాగ్రి పోలీసులకు దొరికాయి. కాగా పారిపోయిన నక్సలైట్ల కోసం పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు. హెలికాప్టర్ ద్వారా పారిపోయిన నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

కాగా నాలుగేళ్ల క్రితం జగదీష్ అనే మావోయిస్టు నేతను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన తర్వాత మరో ఒకటి రెండుసార్లు పోలీసులు,నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఆ తర్వాత పరిస్థితి చక్కబడింది. జిల్లాలో నక్సల్స్ ప్రాబల్యం క్రమంగా తగ్గింది. మావోయిస్టులకు ముఖ్యప్రాంతమైన చత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో ఉండటంతో అక్కడ నక్సల్స్ ఎప్పుడు విరుచుకు పడతారో తెలియని పరిస్థితి. అయితే మూడేళ్ల ప్రశాంతత తర్వాత తాజాగా జరిగిన కాల్పులు జిల్లాలోని రాజకీయ నాయకులతో పాటు ప్రజలను భయానికి గురి చేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X