త్వరలో టిడిపి ఖాళీ అవుతుంది: మంత్రి దానం

2004కు ముందు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు పూర్తి నిరాశతో, నిస్పృహలో ఉన్నారని మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెసు ప్రవేశ పెట్టనన్ని పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని, టిడిపి కంటే కాంగ్రెసు పాలనలోనే గౌరవంగా జీవిస్తున్నామన్న భావన ప్రజల్లో ఉందని అలాంటప్పుడు కాంగ్రెసు ను విమర్శించే అర్హత టిడిపికి లేదన్నారు. వారి హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాని ఇప్పుడు వర్షాలు పడటంతో పాటు సాగు పెరిగి రైతులు అనందంగా ఉన్నారన్నారు. కాంగ్రెసు పాలనను టిడిపి విమర్శించడానికి కారణం పథకాలపై అవగాహన లేక పోవటమే, ప్రజలను మభ్యపెట్టాలనుకోవడమో కారణం కావచ్చని ఆయన అన్నారు. ఫీజు రీయింబర్స మెంట్సు టిడిపి 300 కోట్లు రూపాయలు ఇస్తే కాంగ్రెసు ప్రభుత్వం 3000 కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు.
చేనేత కార్మికుల సంక్షేమ పథకాలకు కేబినేట్ ఆమోదం తెలిపినట్టు పర్యాటక శాఖా మంత్రి గీతారెడ్డి తెలిపారు. చేనేత కార్మికులకు ఇంతకుముందు ఇచ్చిన రుణాలను, వాటి వడ్డీని మాఫీ చేసి కొత్తగా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించనున్నట్లు చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఓ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications