తెలంగాణ జెఎసి మీట్ వద్ద కవితపై గొడవ: కెసిఆర్ గైర్హాజర్

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సమావేశం వెలుపల గొడవకు దిగారు. కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించిన కోటి బతుకమ్మల జాతరను బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కొంత మంది విద్యార్థులు ఒక్కసారిగా లేచి ఆందోళనకు దిగారు. తెలంగాణ కోసం దాదాపు 400 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సమయంలో బతుకమ్మ ఉత్సవాలు జరపడం తగదని వారన్నారు. అయితే, బుధవారంనాడు కవిత కోటి బతుకమ్మల జాతరను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications