రాజమండ్రిలో గాలిలో చక్కర్లు కొట్టిన చంద్రబాబు నాయుడి విమానం

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం వల్ల ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఫ్లైట్ లేటయ్యింది. దీంతో చంద్రబాబు కార్యక్రమాలు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటలకే రాజమండ్రి చేరుకోవాల్సిన చంద్రబాబు రెండు గంటలు ఆలస్యంగా వెళ్లవలసి వచ్చింది.
కాగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిమిత్తం చంద్రబాబునాయుడు గురువారం ఉదయం శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు వెళ్లి, అయితే వాతావరణం అనుకూలించక పోవటంతో రాజమండ్రి వెళ్లాల్సిన కింగ్ ఫిషర్ ఫ్లైట్ ను అధికారులు అనుమతించలేదు. చంద్రబాబు నాయుడు అదే ఫ్లైట్ వెళ్లాల్సి ఉంది. దీంతో ఆయన సుమారు ఉదయం తొమ్మిది గంటలనుండి విమానాశ్రయంలోనే నిరీక్షించారు.












Click it and Unblock the Notifications