రాజ్ న్యూస్ టీవీ ఛానల్ వర్సెస్ నాగం జనార్ధన్ రెడ్డి

ప్రత్యేక తెలంగాణ కోసం వచ్చిన ఏకైక ఛానల్ రాజ్ న్యూస్ పై నాగంకు అంత అక్కసు ఎందుకని సీఈవో ప్రశ్నించారు. ఛానల్ వచ్చిన ఆరు నెలల్లోనే అత్యధిక తెలంగాణ ప్రజలు దీనిని చూస్తున్నారన్నారు. సీమాంధ్రుల ప్రయోజనాలను దెబ్బ కొడుతున్నందుకా, బాబ్లీపై చంద్రబాబు నాయుడు కేవలం నాటకం ఆడాడని నిరూపించినందుకా, తెలంగాణ అనుకూలమని చెప్పి కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించిన వెంటనే కనీసం 24 గంటలు గడువకముందే మాటమార్చిన చంద్రబాబును ఎండగట్టినందుకా అని మండిపడ్డారు. తెలంగాణకోసం పనిచేస్తున్న ఛానల్ పై కక్ష చూపిస్తే 4కోట్ల తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆయన హితవు పలికారు.
రాజ్ న్యూస్ పై నాగం చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా నాగం ప్రవర్తిస్తున్నారని, మళ్లీ ఇలాంటి వ్యాక్యలు చేస్తే సహించేది లేదని సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య హెచ్చరించారు. నాగం వ్యాఖ్యలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఘంటా చక్రపాణి, పలువురు తెరాస నేతలు ఖండించారు.












Click it and Unblock the Notifications