నీ తండ్రిపైనే పోరాడా, నువ్వో లెక్క కాదు: జగన్ పై చంద్రబాబు

Chandrababu Naidu
కాకినాడ: అక్రమాదాయంతో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సాక్షి టీవీని, చానెల్ ను పెట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. మద్య నియంత్రణ కోసం కాకినాడ కలెక్టరేట్ వద్ద పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన శనివారం మాట్లాడారు. వంతాడ అక్రమ మైనింగ్ పై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. ఓ పత్రిక తప్పుడు వార్త రాసిందని ఆయన సాక్షి పత్రికపై దుమ్మెత్తిపోశారు. అవినీతి పత్రిక తనపై రాసిందని, ఆ పత్రిక సంగతి తాను చూసుకుంటానని ఆయన అన్నారు. నీ తండ్రి వైయస్సార్ పైనే పోరాడిన వ్యక్తి అని, నీకు భయపడేది లేదని ఆయన వైయస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఎక్కడి నుంచో వచ్చి అక్రమ మైనింగ్ చేస్తున్నారని, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

వంతాడ మైనింగ్ ను తమ ప్రభుత్వ హయాంలో రద్దు చేశామని, ప్రస్తుత ప్రభుత్వం స్టే ఇచ్చిందని ఆయన అన్నారు. తాను వదిలి పెట్టేది లేదని, గిరిజనుల పక్కన ఉంటానని ఆయన చెప్పారు. అక్రమ మైనింగ్ కు పాల్పడ్డవారి నుంచి డబ్బులు రాబట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి డబ్బుల కోసం అక్రమ మైనింగులో పాలు పంచుకున్నారని, ఆ మంత్రిని తక్షణమే రాజీనామా చేయాలని ఆయన అన్నారు. అవినీతి మంత్రులంతా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. మీడియా భ్రష్టు పట్టిందని ఆయన విమర్శించారు.

రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారని ఆయన విమర్శించారు. మద్య నియంత్రణ కోసం మహిళలు చైతన్యవంతులై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతిపై తాము నిరంతరం పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మంచినీళ్లు దొరకడం కష్టంగా ఉంది గానీ మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ దొరకుతోందని ఆయన అన్నారు. ప్రజలను ప్రభుత్వమే తాగుడుకు అలవాటు చేస్తోందని ఆయన అన్నారు. తాగుడుకు అలవాటు పడి మగవాళ్లు కుటుంబాలను కూడా మరిచి పోతున్నారని ఆయన అన్నారు. రాత్రిపగలు తేడా లేకుండా ప్రజలు తాగుతున్నారని, దీని వల్ల సమాజం భ్రష్టుపట్టిపోతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+