బాలయ్యకు అనుకూలమే, కానీ ఆందోళనలో బసవతారకం సిబ్బంది

సీఈవో ఆర్ పి సింగ్, ఏవో నీరజలే ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. మేనేజ్ మెంట్ కు ఈ విషయాలు తెలియవని వారు చిత్ర హీరో బాలకృష్ణను వెనకేసుకొచ్చారు. నీరజ, సింగ్ లు బాలకృష్ణ వచ్చినప్పుడు ఏదో సర్ది చెప్పి పంపిస్తున్నారని ఆయనకు హాస్పిటల్ లోని సమస్యలు ఏమీ తెలియకుండా చేస్తూ మమ్మల్లి సమస్యలలో ముంచుతున్నారన్నారు. ఓ సమయంలో ఆవేశపడిన ఉద్యోగులకు సీఈవోకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సింగ్ కింద పడ్డారు. ఏవో నీరజపై దాడికి పూనుకోగా పోలీసులు కల్పించుకొని ఆమెను ఆటోలో సురక్షితంగా బయటకు పంపించారు.
తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని వారు అంటున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు బాలకృష్ణ జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ హై ఆంటూ నినాదాలు చేశారు. అయితే ఇందులో ఆధిపత్య పోరు ఉన్నట్టు కొందరు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications