జైపాల్ రెడ్డితో కె చంద్రశేఖర రావు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారా?
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: కేంద్ర మంత్రి, కాంగ్రెసు నేత ఎస్ జైపాల్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని కాంగ్రెసు నాయకుడు గోనె ప్రకాశ రావు వ్యాఖ్యానించారు. కెసిఆర్ పై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గోనె ప్రకాశరావు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ విస్తరణ చేయలేరని, మంత్రి వర్గ విస్తరణ చేస్తే అసమ్మతి పెల్లుబుకుతుందని ఆయన అన్నారు. దాని వల్ల రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో రాజీ లేదని ఆయన చెప్పారు. వైయస్ జగన్ పై చర్యలు తీసుకుంటే దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని ఆయన అన్నారు. వైయస్ జగన్ ను పార్టీ చర్యలు తీసుకోలేదని, పార్టీ బహిష్కరించనంత వరకు వైయస్ జగన్ కాంగ్రెసు పార్టీకి చెందిన నాయకుడేనని ఆయన అన్నారు.