కె కేశవరావుపై గుర్రుమంటున్న సీమాంధ్ర కాంగ్రెసు నేతలు

sailajanath
హైదరాబాద్: తెలంగాణవాదాన్ని భుజాన మోస్తున్న తమ పార్టీ తెలంగాణ నాయకుడు కె. కేశవరావుపై సీమాంధ్ర నాయకులు గుర్రుమంటున్నారు. కాంగ్రెసు శాసనసభ్యులు శైలజానాథ్, ఎర్రాసు ప్రతాపరెడ్డి తదితరులు ఆయన వైఖరిని తప్పు పట్టారు. తెలంగాణ విషయంలో కేశవ రావు తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎప్పుడో తెలంగాణ ఇచ్చేశారని అన్నారు. అనవసరంగా సోనియా పేరును లాగవద్దని, దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని సీమాంధ్ర నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో జరిగిన తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభలో ఆయన వ్యాఖ్యలు సీమాంధ్ర నేతలు భుజాలు తడుముకునేలా ఉన్నాయి. ఆదివారం ఆదిలాబాద్‌ జిల్లా మంచిర్యాలలో జరిగిన త్యాగధనుల సభలో ముగ్గురు మంత్రులు, ఏడుగురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు, యువకులు బలిదానాలకు పాల్పడవద్దని, తెలంగాణ రాష్ట్ర ఫలితాలను అనుభవించాలని కోరారు. 60 ఏళ్ల ఉద్యమంలో ఏం సాధించామని కేశవరావు ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం మనది ఉన్నా పోరాడి సాధించుకోవాల్సిన గతి పట్టిందన్నారు.ఇటీవల గవర్నర్‌ను కలిసిన సందర్భంలో తన ఆవేదన వ్యక్తం చేశానన్నారు. 60 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ సమైక్య వాద ఉద్యమం లేదన్నారు. సహనానికీ ఓ హద్దు ఉంటుందని చెప్పుకొచ్చారు. మనం ఎవరినీ తిట్టాల్సిన అవసరం లేదని, దానిని బలహీనతగా భావిస్తే ఖబడ్డార్‌.. అని సీమాంధ్ర నేతలను పరోక్షంగా హెచ్చరించారు.

కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో తెలంగాణ కోసం సోనియాను అడిగి బయటికి వచ్చానని మరో సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చేవరకు తాను బతికే ఉంటానని, అది ఇంకెంతో దూరం లేదని తెలిపారు. రాష్ట్రంలో కలెక్షన్లు ఎక్కువ కావడంతో ప్రాజెక్టుల అంచానాలు పెరుగుతూనే పోతున్నాయని వెంకటస్వామి విమర్శించారు. గతంలో గాంధీ భవన్‌లో వైఎస్‌ఆర్‌ను తిట్టనని ప్రకటించినప్పుడు ప్రాణహిత- చేవెళ్ల నిర్మాణానికి రూ. 20 వేల కోట్లతో జీవో విడుదల చేశారన్నారు. అనంతరం అది రూ.32 వేల కోట్లు అయిందని, ప్రస్తుతం పెరుగుతూనే పోతోందని వివరించారు. రూ కోట్లు చెల్లించినా తట్టెడు మట్టితీసిన దాఖలాలు లేవని చెప్పారు. దీనికి కారణం కలెక్షన్లు పెరిగిపోవడమేనని విమర్శించారు. రూ. కోట్లు దోచుకుతినడం జరిగిందన్నారు. రాజీవ్‌ రహదార్ల నిర్మాణంలో 600 మంది గుత్తేదార్లు పనులు చేస్తే ఇద్దరు మాత్రమే తెలంగాణ వారు ఉన్నారని పేర్కొన్నారు.

ఆత్మహత్యలతో తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగులుతాయి తప్ప ఉపయోగం లేదని మంత్రి గీతారెడ్డి తెలిపారు. కొందరు అదేపనిగా ఉసిగొలిపేందుకే ఉంటారని, చనిపోయిన అనంతరం ఏమీ చేయరని, కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని తెరాసను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఇటీవల న్యాయవాదులను తెరాస అధినేత కేసీఆర్‌ రెచ్చగొట్టి ఆమరణ దీక్ష చేయించారని, ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర పన్నారని విమర్శించారు. అనంతరం ఎంపీలు వారితో చర్చించి సమస్యను చక్కదిద్దారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే అవకాశం జాతీయ పార్టీకే ఉంటుందని, ప్రాంతీయ పార్టీలకు, ఉప ప్రాంతీయ పార్టీ అయిన తెరాసకు లేదని పేర్కొన్నారు. మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అన్ని పార్టీల అంగీకారంతో సీఎం అధ్యక్షతన తీర్మానం చేశామని, ఎవరికీ అభ్యంతరం లేదని తెలిపారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఇంత వరకు ప్రపంచంలో పోరాటంలో ప్రాణాలు వదిలినవారు ఉన్నారు కానీ బలిదానాలతో ఉద్యమాన్ని బలోపేతం చేసింది చరిత్రలో తెలంగాణలో మాత్రమేనని చెప్పారు. సమావేశంలో 25 మంది నాయకులు ప్రసంగించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో అమరులైన 19 మంది కుటుంబాలకు రూ. లక్షచొప్పున ఆర్థిక సాయం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+