తెలంగాణ ఆడపడుచులను అవమానించారు: కల్వకుంట్ల కవిత

కవిత తెలంగాణలో కోటి బతుకమ్మల జాతరను నిర్వహిస్తున్నారు. నల్లగొండ జిల్లా సూర్యపేట, కరీంనగర్ జిల్లా గోదావరిఖని, వరంగల్ ల్లో ఇప్పటి వరకు జరిగిన బతుకమ్మ జాతరలో ఆమె పాల్గొన్నారు. కవిత డిమాండ్ తో బతుకమ్మ పండుగ నిర్వహణకు జిల్లాకు లక్ష రూపాయల చొప్పున ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీరించింది.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బతుకమ్మకు మహిళలనుండి అనుహ్య స్పందవ వస్తుందని ఆమె చెప్పారు. ఒక్కోరోజు ఒక్కో జిల్లాలో బతుకమ్మను తమ సంస్ధ ఆద్వర్యంలో నిర్వహించి తెలంగాణ వారికి ఉద్యమ స్ఫూర్త రగిలించాలన్నదే మా తాపత్రయం అని ఆమె పేర్కొన్నారు. అందుకు ఇప్పటికే నల్గొండ, ఓరుగల్లులో జరిగిన బతుకమ్మ జాతరలకు మహిళలు బ్రహ్మరథం పట్టారన్నారు. చివరి రోజు రాజధానిలోని ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ ఉత్సవం ఉంటుందని ఆమె గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications