విశ్వాస పరీక్షలో నెగ్గిన కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప

అంతకు ముందు కర్ణాటక శాసనసభ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది. కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(భాజపా) ఆధ్వర్యంలోని యెడ్యూరప్ప ప్రభుత్వం బలపరీక్షకు ముందే అనూహ్య మలుపులు తిరిగాయి. అయితే అంతకుముందే శాసనసభ స్పీకరు 11మంది భాజపా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై, 5 స్వతంత్ర ఎమ్మెల్యేలపై వేటు వేశాడు. వారు ఓటింగ్ కోసం సభకు రావద్దని సూచించారు. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించటంతో మార్షల్స్ అడ్డుకున్నారు. అయితే వారు మార్షల్స్ పై రాళ్లు విసిరి, అద్దాలు పగులగొట్టి శాసనసభలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత వారు గవర్నర్ ను కలిసేందుకు వెళ్లారు. అసెంబ్లీ ఎదుట జెడిఎస్, కాంగ్రెసు ఆందోళనకు దిగాయి.












Click it and Unblock the Notifications