వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అలా వదిలేయడమే

రాష్ట్ర ఆర్థిక వ్యవహారం విషయంలో రోశయ్య బాగానే పని చేస్తున్నప్పటికీ రాజకీయంగా ఆయన బలహీనంగా ఉన్నారని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతను స్వయంగా అధిష్టానం తన మీద వేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా పార్టీ అధిష్టానం గవర్నర్ పై ఎక్కువగా ఆధారపడినట్లు చెబుతున్నారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా వీరప్ప మొయిలీ కూడా నామమాత్రంగానే కొనసాగుతున్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు, ముఖ్యమంత్రి రోశయ్యకు కూడా తెలియకుండా రాష్ట్ర వ్యవహారాలపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications