కెసిఆర్, చంద్రబాబునాయుడిపై భగ్గుమన్న ఫ్రంట్ చైర్మన్ గద్దర్

కెసిఆర్ మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ, నిరంతరం జిల్లా వెనుకబడి ఉంది అని మాట్లాడటం తప్పితే జిల్లాకు చేసిందేమే లేదని విమర్శించారు. పార్లమెంటులో బిల్లు పెట్టించడమే ప్రజా ఫ్రంట్ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ పేరు చెప్పి ఇప్పటి వరకు రైతులు, కార్మికులను ఓట్లు కాచే చెట్లుగానే భావించారు. కాని ప్రజాఫ్రంట్లో వారే నాయకులన్నారు. ఫ్రంట్లో అందరినీ భాగస్వాములను చేయడానికే పల్లెబాటను నిర్వహిస్తున్నామని, ఫ్రంట్ ది చీమల బలం అని వ్యాఖ్యానించారు.
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు గోడమీది పిల్లి వాటం ప్రదర్శిస్తున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు దేశం పార్టీ అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో నిలబెట్టుకోవాలనే ఉద్ధేశ్యంలో ఆయన ఉన్నాడని, అయితే తెలంగాణకు అనుకూలంగా ఆయన ఉంటేనే ఇక్కడ తెలుగు దేశం పార్టీ ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఇక జనంలోకి వెళుతున్న గద్దర్ తాను డిసెంబర్ 9 నుంచి నాన్ స్టాప్ టూరు ఉంటుందని అన్నారు. తెలంగాణ కోసం అవసరమైతే సీమాంధ్రలో పర్యటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆ తరువాత హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications