తండ్రి ఆశయాలు నిలబెట్టుకోవటంలో జగన్ నాకు స్ఫూర్తి: వంగవీటి రాధా

శాసనసభ్యుడు వంగవీటి రాధ నిర్వహించిన దుర్గమ్మ ప్రభల కార్యక్రమానికి చిరంజీవి రాకపోవడంపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత కలహాలతో శనివారంనాటి చిరంజీవి విజయవాడ పర్యటన రద్దయింది. దీంతో రాధ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనకు మంత్రిపదవి ఇస్తానని చెప్పినా చిరంజీవిని నమ్ముకుని తాను ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చానని, అందుకు తగిన శాస్తి అనుభవించానని వంగవీటి రాధ అంటున్నారు. అందరినీ కలుపుకుని వెళ్లకపోతే ఎలా ఆయన ప్రశ్నిస్తున్నారు. బహిరంగంగానే వంగవీటి రాధ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.రెండు రోజుల్లోగా తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకుంటానని ఆయన చెప్పారు. ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు.
దీన్నిబట్టి ప్రజారాజ్యం పార్టీకి దూరం కావడానికి కూడా వంగవీటి రాధాకృష్ణ సిద్ధమవుతున్నట్లు తెలిసి, రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి తొందరపడి నిర్ణయం తోసుకోకూడదని వంగవీటి రాధాకు సమాచారం అందింది.
అయితే అకస్మాత్తుగా చిరంజీవి విజయవాడ పర్యటన రద్దు చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకనే రాధా ఇలా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. వంగవీటి వ్యతిరేకులు అయిన కొంత మంది సీనియర్లు మాట్లాడి చిరంజీవి విజయవాడ పర్యటనను రద్దు చేయించినట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ జగన్ వర్గ సభ్యుడిగా కాంగ్రెస్ లో చేరుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. దీంతో వంగవీటి రాధాకృష్ణ చిరంజీవిపై భగ్గుమంటున్నారు. నిరుడు దుర్గమ్మ ప్రభల కార్యక్రమంలో చిరంజీవి కుమారుడు, సినీ నటుడు రామ్ చరణ్ తేజా పాల్గొన్నారు












Click it and Unblock the Notifications