వైయస్సార్ టార్గెట్: జగన్ కు తెలంగాణ కాంగ్రెసు నేతల సవాల్

కాగా, వైయస్ జగన్ ను తెలంగాణ నాయకులు తప్పు పడుతున్నారు. వైయస్ జగన్ పై ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఓదార్పు యాత్రలో సోనియా, ఇందిరా గాంధీ ఫొటోలు ఎందుకు పెట్టుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు వైయస్సార్ వ్యతిరేకమనే విషయాన్ని మరింత పెద్ద యెత్తున కాంగ్రెసు తెలంగాణ నాయకులు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూ వచ్చిన వైయస్సార్ ఎప్పటికప్పుడు తెలంగాణకు అడ్డుపడుతూ వచ్చారనే విషయాన్ని నాయకులు అప్పుడప్పుడు అంటూనే అంటున్నారు. వైయస్సార్ జీవించి ఉన్నంత వరకు ఏమీ మాట్లాడని నాయకులు ఇప్పుడు తమ స్వరం పెంచేందుకు సిద్ధపడుతున్నారు. వైయస్సార్ తెలంగాణ వ్యతిరేక వైఖరిని బయట పెట్టడం ద్వారా వైయస్ జగన్ కు తెలంగాణలో ఆదరణ తగ్గించే ప్రయత్నాలు చేయాలనేది వారి ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇంత కాలం ఎమ్మార్ ప్రాపర్టీస్, జలయజ్ఝం వంటి వ్యవహారాల విషయంలో వైయస్సార్ పై విమర్శలు చేస్తూ వచ్చిన కాంగ్రెసు సీనియర్ నేతలు ఇప్పుడు కొత్తగా తెలంగాణ వ్యతిరేక వైఖరిని కూడా దుయ్యబట్టేందుకు సిద్ధపడుతున్నారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications