జయప్రద, అమర్ సింగ్ విజ్ఞప్తిపై ఎజి సలహా అడిగిన సుప్రీంకోర్టు

Jayaprada
న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ నుంచి తమను బహిష్కరించిన నేపథ్యంలో పార్లమెంటు సభ్యులుగా తమను అనర్హులుగా ప్రకటించవద్దని కోరుతూ జయప్రద, అమర్ సింగ్ సుప్రీంకోర్టును కోరారు ఈ మేరకు వారు సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు అడ్వొకేట్ జనరల్ జిఇ వాహనవతిని సోమవారం ఆదేశించింది. తదుపరి విచారణను జస్టిస్ అల్తమస్ కబీర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.

పార్టీ విప్ ను పాటించనందుకు 1996 తీర్పు నేపథ్యంలో తమను పార్లమెంటు సభ్యులుగా ఆనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందనే భయంతో వారు సుప్రీంకోర్టుకు ఎక్కారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం బహిష్కరణ తర్వాత కూడా సభ్యుడు లేదా సభ్యురాలు ఆ పార్టీ నియంత్రణలోనే ఉంటారని 1996లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమను బహిష్కరించినందున తమను వేరే శక్తిగా ఎందుకు గుర్తించకూడదో తెలపాలని, వేరే పార్టీ ఎందుకు పెట్టుకోకూడదో కూడా చెప్పాలని జయప్రద, అమర్ సింగ్ సుప్రీంకోర్టును కోరారు. సమాజ్ వాదీ పార్టీ నాయకత్వం తమను అశ్రద్ధ చేసిందని వారు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+