తెలంగాణకు సోనియా అనుకూలమన్న టిడిపి నేత జితేందర్ రెడ్డి

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఇస్తుందనే నమ్మకం లేదని, శ్రీకృష్ణ కమిటీని సీమాంధ్ర నాయకులు ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నాం కాబట్టే 2009లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకున్నామని, కెసిఆర్ ను గెలిపించుకున్నామని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆ తెలుగుదేశం నాయకుడు అన్నారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలంగా ఉందని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ కూడా ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications