రామలింగేశ్వరుడి దగ్గర చిరుతల కలకలం: ఆందోళనలో భక్తులు

దేవాలయం దగ్గర ఉన్న ట్యాంకు దగ్గర అవి ఉంటున్నాయి. దీంతో భక్తులు, దేవాలయంలోని పూజారి భయాందోళనకు గురువుతున్నారు. అయితే ఐదు రోజులుగా వస్తూ అవి ఏ హానీ చేయడం లేదు. దేవాలయ ఆవరణలోనే ఉన్న పూజారి కుటుంబం ఎప్పుడూ తలుపులను బిగించుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. గ్రామం సైతం దేవాలయానికి కొద్ది దూరంలో ఉన్నప్పటికీ గ్రామస్తులూ ఆందోళన చెందుతున్నారు. ఓ యాభై మంది కలిసి పులుల దగ్గరకు వెళితే అవి భయపడి పారిపోతున్నాయని దేవాలయ పూజారి రాజేంద్రప్రసాద్ అంటున్నారు. అటవీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించామని అయితే వారినుండి ఎలాంటి స్పందన లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications