టిడిపి తెలంగాణ ఫార్స్: రైల్లో తాగుడు, సమైక్యవాది ఇంట్లో విందు

కాగా, తాజాగా మరో విషయాన్ని కూడా సాక్షి దినపత్రిక బయటపెట్టింది. తెలంగాణ కోసం సోమవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి, చివరకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసం వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించి అరెస్టయ్యారు. ఆ తర్వాత రాత్రి సమైక్యవాది ఇంట్లో విందుకు తెలుదుదేశం తెలంగాణ ప్రాంతం తమ్ముళ్లు హాజరయ్యారని సాక్షి వ్యాఖ్యానిస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు కొనుకుల నారాయణ రావు నివాసంలో పలువురు తెలంగాణ ప్రాంత నాయకులు విందులో మునిగితేలారని తేల్చింది. తెలంగాణ పట్ల తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులకు ఉన్న చిత్తశుద్ధి ఇది అని వ్యాఖ్యానించింది.












Click it and Unblock the Notifications