కాంగ్రెసు మదమెక్కి దాడులు చేయిస్తోంది: ఎమ్మెల్యే కిషన్ రెడ్డి

ఐటి దాడులు ముప్పయిదేళ్ల క్రితం ఇందిరా గాంధీ నియంతలా మారి దేశంలో ప్రవేశపెట్టిన ఎమర్జేన్సీని తలపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు పార్టీకి దమ్ముంటే కేవలం కర్ణాటకలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెసు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లలో కూడా ఐటితో సోదాలు చేయించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని స్పష్టం చేయకుండా ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటిముందు ధర్నా చేయటం సరికాదని అన్నారు. తెలంగాణకు చెందిన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ముందుగా తమ అధినేత చంద్రబాబు ఇంటిముందు ధర్నాకు దిగి ఆయన వైఖరిని తెలుసుకోవాల్సిందిగా సూచించారు.












Click it and Unblock the Notifications