హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ కాంగ్రెసు నాయకులకు శత్రువే

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డిని తెలంగాణ కాంగ్రెసు నాయకులు శత్రువుగానే పరిగణిస్తున్నారు. తెలంగాణకు వైయస్సార్ అడ్డు పడ్డారని ఇంతకు ముందు కొంత మంది కాంగ్రెసు నాయకులు ప్రకటన చేయగా, తాజాగా మంగళవారం మరికొంత మంది నాయకులు వైయస్సార్ ను శత్రువుగా అభివర్ణించారు. తెలంగాణ కాంగ్రెసు కార్యాచరణ కమిటీ చేసిన ప్రకటన ఈ విషయాన్ని పట్టిస్తోంది. తెలంగాణ సమావేశాల్లో శత్రువు ఫొటో పెట్టబోమని కమిటీ ప్రకటించింది. మహబూబ్ నగర్ లో జరిగిన తెలంగాణ త్యాగధనుల సంస్మరణ సభలో వైయస్సార్ ఫొటో పెట్టకపోవడం జరిగిన గొడవపై కాంగ్రెసు సీనియర్ నేతలు కె కేశవరావు, వి హనుమంతరావుపై మండిపడిన సీమాంధ్ర శాసనసభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్ లపై కమిటీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.

కాంగ్రెసు సీనియర్ నాయకులు కె కేశవరావు, వి హనుమంతరావులపై విజయవాడ కాంగ్రెసు నేతలు మల్లాది విష్ణు, జోగు రమేష్ చేసిన వాఖ్యలు దారుణమని తెలంగాణ కాంగ్రెసు కార్యాచరణ సమితి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నది. వారిపై అధిష్టానానికి తెలంగాణ సంస్మరణ సభ శత్రువులను సన్మానించడానికి ఏర్పాటు చేసింది కాదని వారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. మహబూబాబాద్ సభ కూడా తెలంగాణ అమరవీరుల కోసం ఏర్పాటు చేసిన సభ అని కానీ తెలంగాణ వ్యతిరేకులు, శత్రువులకు ఏర్పాటు చేసిన సభ కాదని అన్నారు.

తెలంగాణ మంత్రులు ఎక్కడ కూడా నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనరాదని తెలంగాణ కాంగ్రెసు కార్యాచరణ సమితి ఆల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ మంత్రులందరూ తప్పకుండా పాల్గొనాలని నిర్బంధంగా వ్యవహరించటం లేదన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కాంగ్రెసు అనుకూలంగా ఉందని తెలియపర్చడానికి మంత్రులు వేడుకలకు దూరంగా ఉండాలని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X