వరంగల్లో కాలువలో పడి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతి
Districts
oi-Srinivas G
By Srinivas
వరంగల్: వరంగల్ జిల్లాలో కాలువలో పడి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు. ఓ వేడుకలో పాల్గొనడానికి హసన్ పర్తి మండలం ముచ్చర్ల గ్రామానికి అన్వేష్, దినేష్ అనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు వచ్చారు. అయితే ఆలా బయట విహరించడానికి వెళ్లి వారు కాలువలో పడి మరణించారు. ఈ ఇద్దరు విద్యార్థులు వరంగల్ లోని ఎస్.ఆర్.ఇంజినీరింగ్ కళాశాలలో ఐటి మూడో సంవత్సరం చదువుతున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థుల మృతితో వారి వారి గ్రామాల్లో, ఎస్ ఆర్ కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.