ఎవరైనా వందకోట్లిస్తే అసెంబ్లీ పేరు మారుస్తారా: రేవంత్ రెడ్డి

తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపెట్టడానికి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆ పేరు పెట్టారని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగు వారు ఎప్పుడూ ఆవమానానికి గురవుతున్నారన్నారు. తెలుగు వారి ఎవరి పేరు లేనట్లు అన్నింటికీ సోనియా కుటుంబం పేర్లు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇరవైనాలుగింటికి రాజీవ్ పేర్లు ఉన్నాయని, ఇక ప్రభుత్వ పథకాలకూ రాజీవ్, ఇందిర పేర్లు పెడుతున్నారన్నారు. అప్పుడు వైఎస్ అయినా, ఇప్పుడూ రోశయ్య అయినా సోనియాగాంధీ మెప్పుకోసమే ఆ కుటుంబాన్ని నిత్యం కలవరిస్తున్నారన్నారు.
టి.సుబ్బరామిరెడ్డి పదికోట్లు ఇస్తే లలిత కళా తోరణానికి పేరు మార్చారు. రేపు మరెవరైనా 100 కోట్లు ఇస్తామంటే అసెంబ్లీ పేరు మారుస్తారా అని ప్రశ్నించారు. రాజీవ్ పేరును వెంటనే తొలగించకుంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకు వెళతామని రేవంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications