చంద్రబాబు నాయుడికి సవాల్ విసిరిన మంత్రి వట్టి వసంత కుమార్

చంద్రబాబునాయుడు మరో అడుగు ముందుకేసి తాను ఇంతకుముందు మైక్రో అనే పదాన్ని వినలేదన్నారు. అయితే చంద్రబాబునాయుడు తాను రాసిన మనసులో మాట పుస్తకంలో సూక్ష్మ రుణ సంస్థల విషయాన్ని ప్రస్తావించినట్టు ఆ పుస్తకాన్ని తెచ్చి విలేకర్ల ముందు చూపించాడు. కోటికిపైగా మహిళల అభివృద్ధికి, అభ్యున్నతికి చంద్రబాబునాయుడు మోకాలడ్డటం మంచిది కాదన్నారు. సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని అందుకు చంద్రబాబునాయుడుతో పాటు ప్రతిపక్షాలన్నీ సహకరించేందుకు కృషి చేయాలి. కాని రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు. తాను మహిళలను కించపర్చేలా మాట్లాడినట్టు చంద్రబాబునాయుడు విమర్శించటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. విజయనగరం జిల్లాలో మత్య్సకార మహిళలు తమకిచ్చిన రుణాలు అనవసరంగా వినియోగించుకుంటుంటే అలా వాడకూడదని, కేవలం రుణాలను ఉత్పాదక వస్తువులపైనే పెట్టాలని సూచించాను. కాని మహిళలను కించపర్చే విధంగా మాట్లాలేదన్నారు. సూక్ష్మ రుణ సంస్థలను ప్రోత్సహించిన చంద్రబాబు వాటిపైనే ప్రభుత్వంపై ధ్వజమెత్తడం శోచనీయమన్నారు.
కాగా మహిళలకు బ్యాంకు వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని వట్టి వసంత్ కుమార్ చెప్పాడు. అయితే ఆ తరువాత మాత్రం అది సాధ్యం కాదని చెప్పాడు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇంత వడ్డీ ఉండాలని నిర్ణయించే అధికారం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. అయితే చట్టం చేశాం కాబట్టి సూక్ష్మ రుణ సంస్థలు ఇప్పుడు వడ్డీని తగ్గిస్తాయని అయన చెబుతున్నారు. లేకుంటే చర్యలు తీసుకునే అధికారం ఉందన్నారు.












Click it and Unblock the Notifications